బీఆర్ఎస్ గూటికి పొన్నాల లక్ష్మయ్య..! క్లారిటీ వచ్చిన మంత్రి కేటీఆర్

by Javid Pasha |   ( Updated:2023-10-13 13:23:58.0  )
బీఆర్ఎస్ గూటికి పొన్నాల లక్ష్మయ్య..! క్లారిటీ వచ్చిన మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా.. ఆయన ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశంగా మారింది. పొన్నాల బీఆర్ఎస్‌లో చేరతారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పొన్నాల బీఆర్ఎస్‌లో చేరతానంటే తాను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని, పార్టీలో ఆయనను చేర్చుకుంటామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌లోకి పొన్నాల వస్తానంటే చాలా సంతోషకరమని, రేపే ఆయన ఇంటికి తానే స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ తెలిపారు. ఇవాళ సాయంత్రం మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా పొన్నాల అంశంపై స్పందించారు. దీంతో బీఆర్ఎస్‌ గూటికి పొన్నాల చేరతారనే ప్రచారం నడుస్తోంది. రాజీనామా తర్వాత కూడా పొన్నాలను కాంగ్రెస్ నేతలెవరూ పట్టించుకోవడం లేదు. ఆయన రాజీనామాపై కూడా ఎవరూ స్పందించడం లేదు.

కాంగ్రెస్‌లో జనగామ టికెట్ దక్కదనే కారణంతో పొన్నాల పార్టీకి రాజీనామా చేశారు. జనగామ టికెట్‌ను ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ ఫిక్స్ చేసింది. దీంతో పల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలు, ప్రజలతో మమేకం అవుతున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరినా జనగామ టికెట్ వచ్చే అవకాశం ఉండదు. కానీ 16న జనగామలో కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆ రోజు పొన్నాల బీఆర్ఎస్‌లో చేరతారనే ప్రచారం నడుస్తోంది.

Advertisement

Next Story