- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Konda Surekha: గురుకులాల్లో కుట్రల వెనుక RS ప్రవీణ్ కుమార్.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) హస్తం ఉందని ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన అనుచరులను సిబ్బందిగా నియమించుకున్నారు. ఇప్పుడు వారి ద్వారానే ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. అంతేకాదు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వచ్చాకే.. ఆయన్ను కార్యదర్శిగా తొలగించారని అన్నారు. దీనిని వదలబోమని.. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
అధికారం కోల్పోయేసరికి బ్రెయిన్ పనిచేయకనే కేటీఆర్(KTR) ఇలాంటి కుట్రలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని.. మరో ఐదేళ్లు కూడా అధికారం తమదే అని ధీమా వ్యకక్తం చేశారు. ఇకనైనా కేటీఆర్ పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లతో తప్పుడు ప్రచారం చేయిస్తే ఊరుకోము అని హెచ్చరించారు. ప్రజలను మోసం చేశారు కాబట్టే మిమ్మల్ని ఓడించి పక్కన పెట్టారని విమర్శించారు. జైలుకు పోవాలని కేటీఆర్‌కు ఉబలాట ఎక్కువైందని ఎద్దేవా చేశారు. ‘సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సమయం రావడంతోనే కవిత పోయింది. మీ నాన్నకు టైం వస్తే ఆయన సైతం పోతాడు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More : RS Praveen Kumar: బీర్లు, బిర్యానీ, రేవ్ పార్టీలే మీకు తెలుసు.. మంత్రి వ్యాఖ్యలపై ఆర్ఎస్పీ ఫైర్