- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది గుడ్లు తిన్న పాము.. నేను ఉపాసమున్నా అని చెప్పినట్టుంది: కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ వేదికగా చేసిన కామెంట్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా కోమటిరెడ్డి స్పందించారు. “పది గుడ్లు తిన్న పాము.. నేను ఉపాసమున్నా అని చెప్పినట్టు” నల్గొండకు చుక్క నీళ్లు లేకుండా నాశనం చేసిన కేసిఆర్.. ఇయ్యలా నాకేం తెల్వదు.. నేనేం చేయాలే.. అంతావాళ్లేనని ఆరోపించడం ఏంటి?’’ అని ఎక్స్(ట్విట్టర్)లో కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కాగా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగర్, మూసి ప్రాజెక్టు, కాడెం ప్రాజెక్టులు కూడా కుంగుబాటుకు గురయ్యాయని నల్లగొండ సభలో కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుకు ఇబ్బందులు వస్తే సరి చేయాలే గానీ విమర్శలతో కాలం వెళ్లదీయవద్దని అన్నారు. కృష్ణానది జలాలు మనందరి జీవన్మరణ సమస్య అని అన్నారు. నదులు, నీళ్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని, అందుకే కేఆఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించారని మండిపడ్డారు.