Komati Reddy : భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

by Rajesh |
Komati Reddy : భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
X

దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. గత సంవత్సరంలో వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఈ సారి ఇప్పటికే పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డాయని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల మంది రైతులకు రూ.7వేల కోట్లు రుణ మాఫీ చేశామని, మరో వారం రోజులో మరో రూ.15వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. మరో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తే తెలంగాణ ప్రజలను బీదరికం నుంచి బయట పడుతరన్నారు. ఇప్పటికే 60వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం పాతబస్తీ కి మెట్రో రైలు రాక తో ఓల్డ్ సిటీ న్యూ సిటీ గా మారనుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed