- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి: కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి డా. బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు దశాబ్ధాల పోరాటానికి అండగా నిలిచి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన దేవత సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశంలో రుణాలులేని రైతులున్న రాష్ట్రంగా తెలంగాణను మార్చుతున్నామని వెల్లడించారు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్ధులు, యువత జీవితాలను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి, సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిబాటన నడుపుతున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అండగా నిలుస్తూ.. ఆశీర్వదిస్తున్న యావత్ తెలంగాణ ప్రజలకు శిరస్సువంచి నమస్కారాలు తెలియజేస్తున్నానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.