- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్టు అప్రజాస్వామికం : మంత్రి హరీష్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమని, సిసోడియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి అరెస్టులు చేస్తోందని ఆరోపించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంత నీచంగా వ్యవహరించిందో దేశమంతా చూసిందన్నారు. సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకున్నదని, ఆప్ ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదని,. రాజకీయంగా ఆఫ్ ను ఎదుర్కోలేక సీబీఐని అడ్డంపెట్టుకొని ఆ సిసోడియాను లిక్కర్ స్కాంలో అరెస్టు చేసిందన్నారు. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా బీజేపీ వ్యవహరిస్తున్నదని, దేశంలో ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రత్యర్ధి, ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బెదిరిస్తోందన్నారు. బీజేపీ ఆటలు సాగవు అని, ప్రజలు ఆపార్టీకి బుద్దిచెప్పే రోజులు అతిత్వరలోనే రాబోతున్నాయన్నారు.