- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్ట్‌లకు మంత్రి హరీశ్ రావు శుభవార్త
దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్ట్‌లకు మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. దళిత బంధులో కూడా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో డబుల్‌బెడ్ రూం ఇండ్ల పట్టాలను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో లబ్ది పొందని పేద జర్నలిస్టుల కోసం మూడు బ్లాక్‌లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దళితబంధులో కూడా జర్నలిస్ట్‌లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. స్వంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు త్వరలోనే నిధులు ఇస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మరోవైపు, పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్‌బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారన్నారు. 300 మందికి నేడు పట్టాలు పంపిణీ చేస్తున్నాం, త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ఇక పట్టాలు అందుకున్న వారితో కలిసి సామూహిక గృహ ప్రవేశం చెద్దామన్నారు. ఈ ఇండ్లు సుమారు 20 లక్షల విలువ ఉంటాయని మంత్రి అన్నారు. వీటిని ఎవరు అమ్మకూడదని స్పష్టం చేశారు.