- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Damodara Rajanarsimha : నర్సింగ్ కళాశాల పనులను సమీక్షించిన మంత్రి దామోదర రాజనరసింహ
దిశ, వెబ్ డెస్క్ : అందోల్ నియోజకవర్గ కేంద్రం అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ప్రారంభమయ్యే బీఎస్సీ నర్సింగ్ కళాశాల (Nursing College),150 పడకల ఆసుపత్రి నిర్మాణం, అభివృద్ధి పనులను వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ(Minister Damodara Rajanarsimha) స్వయంగా పర్యవేక్షించారు. అలాగే కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. ఆందోల్ లోని గురుకుల పాఠశాలలో ఈనెల తేదీ 11 నుండి 14 వరకు జరిగే జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్ కి సంబంధించి ఏర్పా్ట్లు చేస్తున్న మైదానం పనులను, ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు కాలేజీ నిర్మాణం, యంత్ర పరికరాలు, ఫర్నీచర్ కోసం రూ. 43 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా పనులు సాగుతున్నాయి. 60 సీట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కాలేజీ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుంది.