- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Damodara Rajanarsimha : ‘చవకబారు విమర్శలు మానుకో..’ కేటీఆర్‌కు మంత్రి దామోదర హెచ్చరిక
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: చవకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్, ఇప్పుడు నీతులు చెప్పేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటని శుక్రవారం ట్విట్టర్ వేదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని, ఈహెచ్‌ఎస్ కింద ట్రీట్‌మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అవమానిస్తుంటే చోద్యం చూశారని ధ్వజమెత్తారు. మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయండంటూ ఉద్యోగులు, పెన్షనర్లు కోరినా మీరు పట్టించుకోలేదన్నారు. పదేండ్లు మోసం చేసింది చాలదన్నట్టు ఎన్నికల ముందు హడావుడిగా ఓ డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారని ఆరోపించారు. ఉద్యోగులు మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులేమి కాదని ఇకనైనా బీఆర్‌ఎస్ నేతలు ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, పదేండ్లలో మీరు చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించామన్నారు. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకున్నట్టుగా వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయబోతున్నామన్నారు.
ఆరోగ్య మిత్రలతో చర్చలు సఫలం:
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెబాట పట్టిన ఆరోగ్య మిత్రలతో మంత్రి దామోదర రాజనర్సింహ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆరోగ్య మిత్రలు సమ్మె విరమణకు ఒప్పుకున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్లలో దాదాపు 900 మంది ఆరోగ్య మిత్రలు పనిచేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఇప్పటికీ పాత వేతనాలే ఇస్తుండటంతో దుర్భర స్థితుల్లో బతుకులు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెబాట పట్టారు. తాజాగా మంత్రి జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించబోతున్నారు.