- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Akbaruddin Owaisi: నా బాడీలో బుల్లెట్ ఇంకా అలాగే ఉంది.. అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Maharashtra Assembly election campaign)లో ఎమ్ఐఎమ్ పార్టీ కీలక నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(MLA Akbaruddin Owaisi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ‘నా ఊపిరితిత్తులు పాడైపోయాయి.. పనిచేయడం లేదు. నా శరీరంలో బుల్లెట్(Bullet) ఇంకా అలాగే ఉంది. ప్రయాణాలు చేయొద్దని డాక్టర్లు తరచూ చెబుతూనే ఉన్నారు’ అని అన్నారు. అనంతరం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో ఏం మాట్లాడాలో కూడా పోలీసులే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొట్టు పెట్టుకునే వారికి ఎలాంటి హక్కులు ఉంటాయో టోపీ ధరించే వారికి కూడా అవే హక్కులు ఉంటాయని అన్నారు. కాగా, ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్.. ఇప్పుడు టైమ్ 9:45 అవుతున్నదని ప్రచారం రాత్రి 10 గంటల వరకు చేసుకోవచ్చఅని అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) వ్యాఖ్యానించారు. మరో 15 నిమిషాలు మిగిలి ఉందని పదే పదే చెప్పారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో బీజేపీ నేతలు స్పందించి కౌంటర్లు సైతం ఇచ్చారు. మరోవైపు మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి వర్సెస్ మహా వికాస్ అఘాడి మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.