HYD: పవన్ కళ్యాణ్‌పై ఎంఐఎం కార్యకర్త ఫిర్యాదు.. స్పందించిన హైదరాబాద్ CP

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-21 14:46:45.0  )
HYD: పవన్ కళ్యాణ్‌పై ఎంఐఎం కార్యకర్త ఫిర్యాదు.. స్పందించిన హైదరాబాద్ CP
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన(Janasena) పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌(Hyderabad Police Commissioner)కు ఎంఐఎం కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నగర పోలీస్ కమిషనర్‌ సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand)కు ట్వీట్(ఎక్స్‌లో) పెట్టారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. తమను అవమానించేలా కామెంట్స్ చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్‌పై సీపీ సీవీ ఆనంద్ సైతం స్పందించారు. దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటూ ఎంఐఎం కార్యకర్తకు సమాధానం ఇచ్చారు.

Advertisement

Next Story