కర్ణాటక ఎన్నికల బరిలో ఎంఐఎం.. 25 స్థానాల్లో పోటీకి సిద్ధం!

by samatah |
కర్ణాటక ఎన్నికల బరిలో ఎంఐఎం.. 25 స్థానాల్లో పోటీకి సిద్ధం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కర్ణాటక వైపు దృష్టి సారించాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ సాగబోతోందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో తాము కూడా పోటీకి దిగుతామని ఎంఐఎం స్పష్టం చేసింది. ఇక్కడ తమ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేయబోతోందని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ మంగళవారం వెల్లడించారు.

మరోవైపు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ తో పొత్తు కోసం చర్చలు జరుపుతోందని, అయితే ఈ ప్రతిపాదనపై ఆ పార్టీ ఇంకా స్పందించలేదన్నారు. మరో వైపు పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతడూ ఇక్కడ ఇప్పటి వరకు తమ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామని పొత్తుకు సిద్ధంగాఉన్నామన్నారు. కాంగ్రెస్ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అందువల్ల ఆ పార్టీతో పొత్తు లేదన్నారు. 2018 ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులను బరిలో నిలపకుండా జేడీఎస్ కు మద్దతుగా నిలిచింది. అయితే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ లను కర్ణాటకలోని బసవరాజు బొమ్మై ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈ అంశం ఆ రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన అంశం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో ఎంఐఎం ఏ మేరకు ప్రభావాన్ని చూపబోతోందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed