హైడ్రాను రద్దు చేయాలని మేయర్‌కు ఫిర్యాదు చేసిన ఎంఐఎం..!

by Mahesh |
హైడ్రాను రద్దు చేయాలని మేయర్‌కు ఫిర్యాదు చేసిన ఎంఐఎం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ను చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో వరదలకు కారణం అవుతున్న అక్రమ కట్టడాలపై వారం రోజులుగా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. భారీగా పోలీసులు బందోబస్తుతో అక్రమ కట్టడాలను కూల్చి వేసింది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ గోడను కూల్చివేసి అక్రమ నిర్మాణం చేపట్టినందుకు అతనిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే దానం సీరియస్ అయ్యారు రంగనాథ్ లాంటి నాయకులు వచ్చి పోతుంటారని తాను మాత్రం లోకల్ అని.. తనపై ఫిర్యాదు చేసిన అధికారులు నోటీసులు జారీ చేస్తానని, అలాగే హైడ్రా ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచిస్తానని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. తాజాగా ఈ రోజు ఎంఐఎం పార్టీ నేతలు కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ని కలిశారు.హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని రద్దు చేయాలని AIMIM పార్టీ నేతలు మేయర్ కు విజ్ఞప్తి చేశారు. కాగా హైడ్రా కూల్చి వేతల్లో భాగంగా బహదూర్ పురా ఎంఐఎం ఎంఎల్ఏ మహమ్మద్ ముబేన్ చందానగర్ సర్కిల్ లోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఎల్ఏ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకొని రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed