- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేనా మీ సెక్యులరిజం..? సోనియా గాంధీపై OYC ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టర్ తరుఫున సోనియా గాంధీ ప్రచారం నిర్వహించడంపై ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం హుబ్బలి నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఓవైసీ.. సోనియా గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల బీజేపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత జగదీష్ షెట్టర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మూలాలున్న వ్యక్తి అని.. అలాంటి అభ్యర్థి తరుఫున కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని అన్నారు. ఇదేనా మీ సెక్యులరిజం అంటూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ఓవైసీ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మోడీతో ఇలాగే పోరాడుతారా అని నిలదీశారు.
ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తికి ప్రచారం చేసి సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ విఫలమవడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ జోకర్లు, బానిసలు తమను బీజేపీకి బీ టీమ్ అని నిందిస్తారని ఫైర్ అయ్యారు. ఇక, కర్నాటక బీజేపీలో కీలక నేత అయిన జగదీష్ షెట్టర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో కమలానికి గుడ్ బై చెప్పారు. అనంతరం జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను హుబ్బలి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుండి బరిలో దింపింది. ఇందులో భాగంగానే శనివారం సోనియా గాంధీ జగదీష్ షెట్టర్ తరుఫున ప్రచారం నిర్వహించింది.