రేపటినుంచే దరఖాస్తుల స్వీకరణ.. సీఎం రేవంత్‌కు ఎంపీ అసద్ స్పెషల్ రిక్వెస్ట్

by GSrikanth |
రేపటినుంచే దరఖాస్తుల స్వీకరణ.. సీఎం రేవంత్‌కు ఎంపీ అసద్ స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. పాలనా యంత్రాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలను నిర్వహించాలని నిర్ణయించింది. ‘ప్రజా పాలన’ పేరుతో రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డును కవర్ చేసేలా ఎనిమిది రోజుల షెడ్యూల్‌ను రూపొందించింది. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలపై ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. తాజాగా.. ఈ ప్రజాపాలనపై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన ద్వారా స్వీకరించే దరఖాస్తులు ఉర్దూలోనూ ఉండాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉర్దూ భాషలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్‌ను కోరారు. అందరూ అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్ధిపొందాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed