Hyderabad Metro Parking :వెనక్కి తగ్గిన మెట్రో యాజమాన్యం.. ఫ్రీ పార్కింగ్‌పై కీలక అప్డేట్

by Ramesh N |
Hyderabad Metro Parking :వెనక్కి తగ్గిన మెట్రో యాజమాన్యం.. ఫ్రీ పార్కింగ్‌పై కీలక అప్డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో ఉచిత పార్కింగ్ పై యాజమాన్యం కీలక అప్డేట్ ఇచ్చింది. నాగోల్‌, మియాపూర్‌ మెట్రో వద్ద పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని యాజమాన్యం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రకటన చేసింది. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్‌లో మెట్రో పార్కింగ్ లాట్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామని ఇటీవల కీలక ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారంటూ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఫ్రీ పార్కింగ్ సదుపాయం పునరుద్దరించాలంటూ ఈ నెల 25న నాగోల్ మెట్రో‌స్టేషన్ వద్ద ప్రయాణికులు మహాధర్నా చేపట్టేందుకు సిద్దమయ్యారు. దీంతో నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లో పెయిడ్ పార్కింగ్‌పై హైదరాబాద్ మెట్రో అధికారు వెనక్కి తగ్గారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉచిత పార్కింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం కన్పిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed