హైదరాబాద్ ప్రజలకు మెట్రో MD శుభవార్త.. రెండో దశ విస్తరణపై కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
హైదరాబాద్ ప్రజలకు మెట్రో MD శుభవార్త.. రెండో దశ విస్తరణపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండో దశ ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని కలుపుతూ 70 కిలోమీటర్ల పొడవునా విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. సెకండ్ ఫేజ్ కారిడార్ కోసం వేగంగా ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ జరుగుతోందని అన్నారు. రెండో దశ కారిడార్‌లో అన్ని వర్గాలకు అందుబాటులో మెట్రో ఉంటాయని శుభవార్త చెప్పారు. మెట్రో విస్తరణతో నగర ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు.. హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు దోహదపడుతాయని అన్నారు.

కాగా, ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ఈ రెండో దశ విస్తరణలో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్ వరకు పొడిగించనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేలా కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ఇక రెండో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్లు.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు.. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు పొడగించనున్నారు. అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి-7 రోడ్‌ను కలుపుతూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మొత్తం 29 కిలోమీటర్ల పొడవునా ఇంకో రూట్ నిర్మించనున్నారు. ఇది ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద నిర్మించనున్న హైకోర్టు వరకు మరో 4 కిలోమీటర్ల పాటు విస్తరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed