- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: బీజేపీ మేరు శిఖరం.. వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ నివాళులు
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నివాళుల అర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని అటల్ సమాధి అయిన రాజ్ ఘాట్ ను సందర్శించిన ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ మేరు శిఖరం.. నాలాంటి సామాన్య కార్యకర్తలకు మార్గదర్శనమని, ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపమని కొనియాడారు. భరతమాత సేవకే అణువణువూ సమర్పితం చేసిన రాజ నీతిజ్ఞుడు, దార్శనికుడు, రచయిత, కవి, భరతమాత ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ ఘాట్ లోని సదైవ అటల్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించడం జరిగిందని ఎక్స్ లో రాసుకొచ్చాడు. కాగా బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరైన అటల్ బిహారీ వాజ్ పేయి.. భారత దేశానికి 11వ, 14వ ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2015లో భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న ప్రకటించింది.