స్నేహితుడి ఇంటికి వెళ్లివస్తానని చెప్పి బయటికి వెళ్లిన యువతి.. ఏం జరిగిందో తెలుసా..

by Sumithra |   ( Updated:2023-04-22 01:36:50.0  )
స్నేహితుడి ఇంటికి వెళ్లివస్తానని చెప్పి బయటికి వెళ్లిన యువతి.. ఏం జరిగిందో తెలుసా..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి : తన స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను అని ఇంటి నుండి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర కు చెందిన ఉత్తమ్ రావు కొన్ని సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి బోయిన్ పల్లి సిఖ్ విలేజ్ లోని జైన్ స్కూల్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. ఇతనికి ఓ కుమారుడు, కూతురు రాచారి కిరణ్ అమృత్ రావు (19) ఉన్నారు. కూతురు రాచారి కిరణ్ అమృత్ రావు ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. ఈ క్రమంలో రాచారి కిరణ్ అమృత్ రావుకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ జోషి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమమంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుని ఇంట్లో విషయాన్ని తెలిపారు. కానీ రాచారి కిరణ్ అమృత్ రావు ఇంట్లో ఒప్పుకోలేదు. సదరు యువతి కొన్ని రోజులు తల్లితండ్రులు చేపినట్లు గానే వుంటూ ఇంట్లో వారిని నమ్మించింది. అయితే గురువారం తన స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు రాహుల్ తో వెళ్ళిపోయి ఉంటుందనే అనుమానంతో బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగ ఇలాగే ఐదు నెలల క్రితం రాచారి కిరణ్ అమృత్ రావు ఇంటినుడి వెళ్లిపోవడం తల్లి దండ్రులు తీసుకురావడం గమనార్హం.

Advertisement

Next Story