- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఫ్లెక్సీలే తొలగిస్తారా...? అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకుల వీరంగం..
దిశ, కూకట్పల్లి: జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి పొడవున ఎక్కడ పడితే అక్కడ వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమే జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిబ్బంది పాలిట శాపం అయింది. మా ఫ్లెక్సిలే తొలగిస్తారా...? అంటు అర్ధరాత్రి కూకట్పల్లి బీఆర్ఎస్ నాయకులు ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిబ్బందిపై దాడి చేశారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో తొలగిస్తున్నామని చెప్పిన వినిపించుకోలేదు. ఫ్లెక్సీలకు ఉన్న పైపులతో, పిడిగుద్దులు గుద్దుతూ తమ ప్రతాపాన్ని చాలి చాలని జీవితాలతో జీవితం వెళ్లదీసే కార్మికులపై చూపించారు. ఈ నెల 5వ తేది అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకోగా కార్మికులకు మద్దత్తుగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిలవకపోగా, కాంప్రమైజ్ చేసుకోండంటూ ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు సమాచారం.
తప్పెవరిది శిక్ష ఎవరికి...?
జీహెచ్ఎంసీ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుడదు అన్న నిబంధనలు ఉన్నాయి. ఏకంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎన్నో సందర్భాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సొంత పార్టీ నాయకులపైనే జరిమాన విధించేందుకు ఆదేశాలు జారి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 5వ తేది సోమవారం అర్ధరాత్రి భరత్ నగర్ నుంచి కేపీహెచ్‌బీకాలనీ వరకు జాతీయ రహదారి పొడవున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని సర్కిల్ డీసీ ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్ విభాగం సూపర్వైజర్ ఏ. శివశంకర్, డ్రైవర్ ఎం. రాజ్ కుమార్, కే. రాజు, ఎల్. నాగబాబు, పి. అంజయ్యలు అర్ధరాత్రి విధులలో చేరి భరత్‌నగర్ నుంచి ప్లెక్సీలను తొలగిస్తూ వచ్చారు.
బాలాజీనగర్ డివిజన్ వివేక్ నగర్ కమాన్ వద్ద 1:45 గంటల ప్రాంతంలో ఫ్లెక్సీలను తొలగిస్తుండగా కూకట్‌పల్లికి చెందిన పది మంది అక్కడికి చేరుకుని తమ ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారంటూ దుర్భాషలాడుతూ గొడవకు దిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ సూపర్వైజర్ శివ శంకర్ తెలిపారు. అందులో బి. సంతోష్, సిహెచ్. ప్రభాకర్ అనే ఇద్దరితో పాటు మరో ఎనిమిది మంది తమపై దాడి చేశారని, ఫ్లెక్సీలకు ఉండే పైపులతో, పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన వారు కూకట్పల్లి డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులని ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తెలిపారు.
డయల్ 100.. అంటు మెసేజ్ చేసిన డీసీ..
విధులు నిర్వహిస్తుండగా తమపై బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడుతున్నారని మూసాపేట్ డీసీకి సమాచారం అందించగా డయల్ 100 అంటు వాట్సప్‌లో మెసేజ్ చేసినట్టు సిబ్బంది తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విధులకు హాజరు అయిన తమపై దాడికి పాల్పడితే అర్ధరాత్రి తమను రక్షించడానికి ఎవరు అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది. అదే సమయంలో బీఆర్ఎస్ నియోజకవర్గం స్థాయి నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడించేందుకు ప్రయత్నించిన వినకుండా తమపై దాడి చేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంప్రమైజ్... లేదా సిబ్బందిపై తొలగింపు చర్యలు...?
5వ తేది అర్ధరాత్రి తమపై దాడి జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో 6వ తేది 6 గంటలకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు 7వ తేది వరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. 7వ తేది, బుధవారం మధ్యాహ్నం ఫిర్యాదుకు సంబంధించిన అక్నాలెజ్మెంట్ కాపీని ఇచ్చారు. ఇదంతా ఒకవైపు కాగా గొడవను కాంప్రమైజ్ చేసుకోండంటూ సిబ్బందిపై వత్తిడి పెరిగినట్టు సమాచారం కాంప్రమైజ్ కాక పోతే ఉద్యోగం నుంచి తొలగించేందుకు పావులు కదుపుతారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అర్ధరాత్రి ఎందుకు విధులకు పంపించారో...?
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రోజు పని వేళలలో నిరంతరం పని చేస్తుంటుంది. కాగా 5వ తేదీన ఫ్లెక్సీలు తొలగించేందుకు ప్రత్యేకంగా అర్ధరాత్రి సిబ్బందిని నైట్ డ్యూటీ విధించి వారితో ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం వెనక మతలబు ఏముంది...? జూన్ 2 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నుంచి 5వ తేది వరకు నియోజకవర్గంలోని జాతీయ, అంతర్గత రహదారులన్ని భారి ఫ్లెక్సీలతో నింపేశారు అన్ని పార్టీల నాయకులు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సి పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అసలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు చర్యలు తీసుకోని అధికారులు కొంపలు ముంచుకు వచ్చినట్టు సిబ్బందిని బలి పశువులుగా చేస్తు అర్ధరాత్రి ప్రత్యేకంగా నైట్ డ్యూటీ విధించి మరి ఫ్లెక్సీలను తొలగించేందుకు పంపడం వెనుక మతలబు ఏముందో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై దాడి జరిగిన విషయంలో జోనల్ కమిషనర్‌ను సిబ్బంది కలిసి తమ బాధను విన్నవించుకుంటే అసలు అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి డ్యూటీ ఎందుకు విధించారు అంటు సర్కిల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
కేసు నమెదు అయ్యేలా చర్యలు తీసుకుంటాం: జోనల్ కమిషనర్ మమత
ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై దాడికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయంపై జోనల్ కమిషనర్ మమతను దిశ వివరణ కోరగా సిబ్బంది తనతో వచ్చి కలిసి దాడికి సంబంధించి సమాచారం అందించారని, సర్కిల్ డీసీ రవి కుమార్‌ను దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు జోనల్ కమిషనర్ మమత తెలిపారు.