- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిట్టల బస్తీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం : కూకట్పల్లి ఎమ్మెల్యే
దిశ, కూకట్పల్లి: పిట్టల బస్తీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఫతేనగర్ డివిజన్ పరిధిలోని పిట్టల బస్తీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్‌తో కలిసి పర్యటించారు. కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటి హాల్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం పిట్టల బస్తీలో పాదయాత్ర నిర్వహించి కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డివిజన్లో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. కాలనీలో ప్రభుత్వ పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదురుకుంటున్నట్టు తమ దృష్టికి రావడంతో వెంటనే కమ్యూనిటి హాల్ నిర్మాణం చేపట్టి అందులో పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కాలనీలో తాగునీటి, డ్రైనేజి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శంకర్, డివిజన్ అధ్యక్షుడు భిక్షపతి, రాములు, జయమ్మ, రాము, కీర్తి తదితరులు పాల్గొన్నారు.