మైనారిటీల అభ్యున్నతి కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యం : కర్ణాటక మంత్రి

by Aamani |
మైనారిటీల అభ్యున్నతి కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యం : కర్ణాటక మంత్రి
X

దిశ, కూకట్​పల్లి: మైనారిటీల అభ్యున్నతి కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమని కర్ణాటక రాష్ట్ర ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి జమీర్​ అహ్మద్​ ఖాన్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి బండి రమేష్​కు మద్దతుగా ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​లో నిర్వహించిన మైనారిటీల సమావేశానికి కర్ణాటక ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి జమీర్​ అహ్మద్​, శివాజీ నగర్​ ఎమ్మెల్యే రిజ్వాన్​ అహ్మద్​లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమీర్​ అహ్మద్​ ఖాన్​ మాట్లాడుతూ దేశంలో మైనారిటీల అభ్యున్నతికి పాటు పడే పార్టీ కేవలం కాంగ్రెస్​ పార్టీయేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ 4 వేల కోట్లతో మైనారిటి డిక్లరేషన్​ ప్రకటించిన మైనారిటీల అభివృద్ధి, అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించిందని అన్నారు.

అనంతరం శివాజీ నగర్​ ఎమ్మెల్యే రిజ్వాన్​ అహ్మద్​ మాట్లాడుతూ మైనారిటీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్​ పార్టీకి కూకట్​​పల్లి నియోజకవర్గ మైనారిటీలు తమ సంపూర్ణ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బండి రమేష్​ మాట్లాడుతూ ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​లో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, హస్మత్ పేట్​ చెరువు సుందరీకరణ చేశామని గొప్పలు చెప్పుకుని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని డిమాండ్​ చేశారు. చెరువు చుట్టుపక్కల ఉన్న భూములను ఎమ్మెల్యే, అతడి అనుచరులు కబ్జాలు చేయడం తప్ప చెరువు సుందరీకరణ ఎక్కడ జరగలేదని అన్నారు. డివిజన్​లో 50 లక్షలతో నిర్మించిన మాడల్​ మార్కెట్​ నాలుగు సంవత్సరాలైన ఇప్పటికి ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు.

డివిజన్​లో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి, బీఆర్​ఎస్​ నాయకుల ఇండ్ల ముందు సీసీ రోడ్లు వేసి డివిజన్​ అంత అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అంజయ్య నగర్​ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఓటు హక్కు లేదు కాబట్టి మౌలిక వసతులు కల్పించడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో మైనారిటీలకు మైనారిటి బంధు, మైనారిటీ కార్పొరేషన్​ నుంచి రుణాలు అందించడంలో ఎమ్మెల్యే విఫలం అయ్యాడని అన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్​ మాట ఇచ్చిన బీఆర్​ఎస్​ గత పది సంవత్సరాలుగా దాటవేస్తూ వస్తుందని అన్నారు. కాంగ్రెస్​ పార్టీ మైనారిటీల కోసం 4 వేల కోట్లతో మైనారిటి డిక్లరేషన్​ను ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్చార్జి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి, ఎండి మోయిజ్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed