హైడ్రాపై అవగాహన

by Sridhar Babu |
హైడ్రాపై అవగాహన
X

దిశ, కూకట్​పల్లి : సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా చూస్తుందని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ తెలిపారు. నరేడ్కో వెస్ట్​జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హైడ్రాపై అవగాహన సదస్సుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ మట్లాడుతూ చెరువు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రా పని చేస్తుందని, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా చూస్తుందని అన్నారు.

అనంతరం వెస్ట్​జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​ చైర్మన్​ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్​ మాట్లాడుతూ సామన్య ప్రజలు, బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రంగనాథ్​ దృష్టికి తీసుకు వచ్చారు. అదే విధంగా చెరువులు, నలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా సంస్థ చేస్తున్న పనులకు తమ అసోసియేషన్​ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. అదే విధంగా బిల్డర్స్​కు ఎదురవుతున్న పలు సమస్యలను రంగనాథ్​ దృష్టికి తీసుకు వెళ్లారు.

అనంతరం వెస్ట్​జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు బి. లక్ష్మీనారయణ కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను, చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు ఏర్పడిన హైడ్రా సంస్థను స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్​ కార్యదర్శి కేవీ. ప్రసాద్​ రావు, నరేడ్కో ఉపాధ్యక్షుడు సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్​ కోశధికారి కె. సుభాష్​ బాబు, ఉపాధ్యక్షుడు కోటేశ్వర్​ రావు, మన్నే రవి, నార్నే శ్రీనివాస్​ రావు, నరేంద్ర ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed