- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bonalu : ముస్తాబైన లాల్ బజార్.. రెండు రోజులు వేడుకలు
దిశ,కంటోన్మెంట్ : లాల్ బజార్ లో బోనాల సందడి షురూ అయ్యాయి.ఆషాడమాసంలో బుధ,గురువారాల్లో జరిగే బోనాల వేడుకలకు సర్వం సిద్ధమైంది.మంగళవారం ఘటం ఎదుర్కోళ్ళతో బోనాలు ప్రారంభమయ్యాయి. ఆషాడమాసంలో నగరమంతా ఆదివారం బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుండగా, లాల్ బజార్ మహంకాళి ఆలయంలో మాత్రం ప్రతి ఏటా బుధ, గురు వారాల్లో బోనాల వేడుకలను నిర్వహిస్తుంటారు. ఇక్కడ బుధవారం మహిళలు పెద్ద ఎత్తున బోనాలను సమర్పిస్తారు. తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులు జోరుగా సాగనున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పాటు పిల్లలు, పెద్దల కాలక్షేపం కోసం పలు రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేస్తుంటారు.
ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు..
లాల్ బజార్ మహంకాళి ఆలయంలో బుధ, గురు వారాలు జరిగే బోనాల ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు మురళి ముదిరాజులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం జరిగే బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి బోనాల సమర్పించేందుకు వచ్చిన మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చే విఐపి ల తో పాటు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం బోనాలు, గురువారం భవిష్యవాణి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని రంగురంగుల పూలు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.