ప్రజల బాధ తీర్చడమే ప్రధాన ఎజెండా : ఎంపీ ఈటల

by Aamani |
ప్రజల బాధ తీర్చడమే ప్రధాన ఎజెండా  : ఎంపీ ఈటల
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజల బాధ తీర్చటమే ఎజెండాగా మా విజన్ ఉంటుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేను అనుభవించిన దు:ఖాన్ని ఇప్పుడున్న పిల్లలు అనుభవించకూడదని తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మొదటి జీవో సన్న బియ్యం పెట్టాలని ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో... అధిష్టానానికి తెలుసున్నారు. ఆదివావారం మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలోని కంటోన్మెంట్ లో ఈటల రాజేందర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా 24 ఏళ్ల రాజకీయ జీవితంలో నలుగురు ముఖ్యమంత్రులతో ఫైట్ చేసినట్లు ఈటల పేర్కొన్నారు. నిన్ననో మొన్ననో నా పైన ఎవరో స్టేట్ మెంట్ ఇచ్చారని.. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడినని చెప్పారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి తో కూడా కోట్లాడుతానని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి సంగతి చూస్తానని హెచ్చరించారు.

ఈ ముఖ్యమంత్రి గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచారని, కేసీఆర్ నన్ను డబ్బు, మద్యం ,కుట్రలతో ఓడించారని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతక అవుతాను అంటే.. ఈ ప్రాంతం కాకపోయినా ,ఈ ప్రజలతో పెద్ద సంబంధం లేకపోయినా నాడు రేవంత్ రెడ్డిని గెలిపించిన చరిత్రను మరిచిపోవద్దన్నారు. కానీ నెనొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబడితే... నా ఇంటి పక్కకు వచ్చి మీటింగ్ పెట్టి ఈటల రాజేందర్ కు మల్కాజ్ గిరి తో ఏం సంబంధం అని రేవంత్ రెడ్డి అనడం ఎంతవరకు సమంజసమన్నారు. నాలాంటోడు బతకటానికి రావచ్చు కానీ.. ముఖ్యమంత్రి కి తెలియదు కావచ్చు..మల్కాజ్ గిరి లో మోజారీటీ ప్రజలు బతుకు దెరువు కోసం వచ్చని వారేనన్నారు. మాట్లాడితే చప్పట్లు కొడతారనో.. ఈ పూటకు హెడ్ లైన్ ల కోసం మాట్లాడితే చరిత్ర క్షమించదన్నారు. ప్రజలు ప్రలోభాలకు ఆశపడి ఓటు వేద్దామని అనుకోరన్నారు. నాయకుడనేవాడు ఓట్ల కోసం,పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేస్తారని, ప్రలోభ పెడతారు తప్ప ప్రజలు ఎన్నడూ ఆశించరని తెలిపారు.

డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తానని కేసీఆర్ మోసం.. ఈటల

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశాడని ఈటల రాజేందర్ ఆరోపించారు. మొదటి సంవత్సరం ప్రాజెక్టులు కడుతున్నానని మభ్యపెట్టారని, ఐడిహెచ్ కాలనీలో 100 ఇల్లు కట్టి అందరికి చూపించి ఇలా కట్టిస్తానని నట్టేట ముంచాడని అన్నారు. మారేడ్ పల్లిలో పాత ఇళ్లను తీసేసి కొత్త ఇల్లు కట్టారని, పదేళ్లు అయినా ఇండ్లను అందరికి పంపిణీ చేయలేదన్నారు. కట్టాల్సిన ఇండ్లు 520 ఇండ్లు అని, కానీ 478 ఇండ్లు మాత్రమే కట్టి, వాటిలో 248 ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారని దుయ్యబట్టారు. నిజమైన పేదలకు లబ్ది చేకూరాలని, ఎలాంటి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ అందజేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టడు బంద్ చేయాలని, పది రోజల్లో పని పూర్తి చేస్తానని హామి ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నందున .. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కరించే జిమ్మేదార్ తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలుపాలని డిమాండ్ పైన కమిటీ ఏర్పడిందన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టంచేశారు. మీరే నా విఐపీలు అని ఈటల అన్నారు.

నేను ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. పదేళ్లు భారతీయుడు తలేత్తుకునే విధంగా ప్రధాని మోడి పాలించారని తెలిపారు. చెంచు పెంటలు, లంబాడి తండాల్లో కూడా 24 గంటలు నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ కంటోన్మెంట్ లో మిషన్ భగీరథ నీళ్లు సరిపోను రావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 66 రకాల హామీలు ఇచ్చారని. ఈ హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తానని ఈటల స్పష్టంచేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటేడ్ సభ్యుడు జె.రామకృష్ణ, మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక,కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు సదాకేశవరెడ్డి, భానుక నర్మద, నాయకులు పరశురామ్, భానుక మల్లికార్జున్, డాక్టర్ వంశా తిలక్, పిట్ల నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Next Story

Most Viewed