మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కీలక విజ్ఞప్తి చేసిన క్రైస్తవులు

by sudharani |   ( Updated:2022-12-12 14:03:48.0  )
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కీలక విజ్ఞప్తి చేసిన క్రైస్తవులు
X

దిశ, ఉప్పల్: ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ క్రీస్టియన్ భవనం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవుల స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉప్పల్లో క్రైస్తవులకు ప్రత్యేక స్మశాన వాటిక లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, స్మశాన వాటికకు స్థలం కేటాయించి మోడల్ స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ఉప్పల్ క్రైస్తవ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్‌కి దృష్టికి తీసుకొచ్చారు.

కాగా.. సోమవారం రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కి కార్పొరేటర్ ఈ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఉప్పల్లో స్థలం కేటాయించేంత వరకు ఎల్బీనగర్‌లో ఉన్నటువంటి క్రైస్తవ స్మశాన వాటికకు ఉప్పల్ క్రైస్తవులను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించి స్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండలరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, అల్లిబిల్లి మహేందర్, రవీందర్ గౌడ్ పుష్ప రాజ్, శ్యామ్ ఉప్పల్ పాస్టర్ అసోసియేషన్ సలహాదారులు రేవా జీకే బాబు, దేవదానం, అధ్యక్షులు జి ప్రభాకర్, కార్యదర్శి గోన నతేయిల్, మనోహర్ జన్ను, బొడ్డు జాన్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

READ MORE

BRS Party: బాటలో తెలంగాణ జాగృతి..? MLC Kavitha పక్కా ప్లాన్ వేశారా..?

Advertisement

Next Story