- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశానికే తెలంగాణ రోల్ మోడల్: మంత్రి మల్లారెడ్డి
దిశ, నాగారం: దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తోందని, తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం నాగారం మున్సిపాలిటీలోని ఎల్ఆర్ఎస్ నిధులతో 6వ వార్డులోని శిల్పానగర్ లో పార్క్ నిర్మాణం రూ. 90 లక్షలు, 10వ వార్డులోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద బీటీ రోడ్డు నిర్మాణం రూ. 9.20 లక్షలు, 20 వ వార్డులోని హిందూ స్మశానవాటిక నిర్మాణం కోటి రూపాయలతో అభివృద్ధి పనులను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత పూర్తిగా నాగారం రూపు రేఖలు మారిపోయాయని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీలలో చెరువులు, డ్రైనేజీలు, పార్కులు, నర్సరీలు, డంపింగ్ యార్డ్ లు ఎక్కడా చూసిన కాలనీలలో మంచి వాతావరణం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్, కేటీఆర్ లకే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెరువులు కానీ, కాలనీలు కానీ మురికి కూపంగా ఉండేవని రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులలో మురికి నీరు కలువకుండా సివరేజ్ పైప్ లైన్ ద్వారా డ్రైనేజీని మల్లించారని అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 9 సంవత్సరాలలో చేసిందేమిలేదని మాటలు తప్ప చేతకానీ, దగుర్బాజీ ప్రభుత్వం అని, కేంద్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేశ్ యాదవ్, కమిషనర్ వాణి రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, మున్సిపల్ డీఈఈ సుదర్శనం రఘు, మేనేజర్ చంద్ర శేఖర్, బీఆర్ఎస్ నాయకులు, సానిటరీ ఇన్ స్పెక్టర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.