- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే సమస్యలను పరిష్కరిస్తా: ఈటల రాజేందర్
దిశ,మేడ్చల్ బ్యూరో : రైల్వే బ్రిడ్జీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తానని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం మేడ్చల్ నుండి బొల్లారం వరకు ఉన్న రైల్వే స్టేషన్ లతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైల్వే బ్రిడ్జీల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాట ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. 30 సంవత్సరాలుగా బొల్లారం ఆర్వోబీ సమస్య నానుతూనే ఉందన్నారు. ముప్పై ఏళ్ల కిందనే ప్రణాళిక సిద్ధం చేయడమే కాదు, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం కూడా అందించారని తెలిపారు. కానీ ఇంతవరకు నిర్మాణం కాలేదన్నారు.అరగంటకు ఒక సారి ఇక్కడ గేట్ పడుతుందని,వాహనదారులు, పాదచారులు ఆఫీసీలకంటే రోడ్డు మీదనే ఎక్కువ సేపు గడుపుతున్న దుస్థితి నెలకొందని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు.
కొంపల్లి లో పాత ఆర్వోబీ కింద ఆర్ యూబీ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. వినాయక నగర్ లో ఆర్ యూబీ సమస్య ఉన్నట్లు తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టుల గురించి తాను ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.. రైల్వే మంత్రి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నానని, పరిష్కారం చూపించేలా నివేదిక సిద్ధం చేస్తామని ఈటల పేర్కొన్నారు. వీటి నిర్మాణంలో తమ వాటా ఇవ్వడానికి రాష్ట్రం ముందుకు రాకపోతే ,కేంద్రమే మొత్తం నిధులు వెచ్చించి నిర్మాణం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.
నరేంద్ర మోడి హాయంలోనే అభివృద్ది : ఈటల
ప్రధాని నరేంద్ర మోడీ హాయంలోనే రైల్వే అభివౄద్ది జరిగిందని ఈటల రాజేందర్ తెలిపారు. అంతకంటే ముందు.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి జరగలేదన్నారు. మోదీ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల కోట్లతో.. రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలు తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.మేడ్చల్ రైల్వేస్టేషన్లో 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు.గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నట్లు తెలిపారు.మెట్రో రైల్ మాదిరిగా ఎంఎంటీఎస్ కి కూడా దగ్గర దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయమని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని తెలిపారు. బొల్లారం, వినాయక నగర్ గేట్లు రెండు రెండు గంటలు పడుతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ గూడెం అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరో 20 సంవత్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని అండర్ పాస్ లను అభివృద్ధి చేస్తాము. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని రైలు నిలయం, రైల్వే ఆస్తులు, చర్లపల్లి టెర్మినల్, అనేక రైల్వే లైన్లు ఉన్నాయని తెలిపారు.
కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ లోని పలు రైల్వే స్టేషన్లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, పాల్గొన్న అధికారులు సుబ్రహ్మణ్యం, సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, రామారావు సీనియర్ డివిజన్ కోఆర్డినేషన్, శ్రీనివాస్ బీజేపీ నేతలు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రం రెడ్డి, గిరి వర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, భరత సింహారెడ్డి మాణిక్ రెడ్డి, శివాజీ, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.