- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ పాలనలో బాంబుల మోతలు లేవు, కర్ఫ్యూలు లేవు: ఈటల రాజేందర్
దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అటు దేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో బాంబుల మోతలు లేవు, కర్ఫ్యూలు లేవు అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. కంటోన్మెంట్‌లోని రసూల్‌పుర, అన్నానగర్, అర్జున్‌నగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కానుందని, అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను చేపట్టారని ఇది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. కరోనా పరిస్థితుల్లో పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని ఉద్దేశ్యంతో ప్రధాని రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేయిస్తున్నారని, 2029 వరకు ఈ పథకం అమలులో ఉంటుందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రామకృష్ణ, బానుక నర్మదా మల్లికార్జున్, సదా కేశవరెడ్డి, బి.ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.