బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక చేయూత

by Javid Pasha |
బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక చేయూత
X

దిశ, ఉప్పల్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన కానిస్టేబుల్ శేఖర్ కుటుంబానికి రూ.8 లక్షల భద్రతా ఎక్స్ గ్రేషియాను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అందజేశారు. ముగ్గురు మైనర్ పిల్లలపై తలా 1,33,300 రూపాయల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. శేఖర్ భార్యాపిల్లల యోగ క్షేమాలను ఎప్పిటికప్పుడు తెలుసుకుంటూ తగిన సాయం అందిస్తామని సీపీ తెలిపారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పని చేస్తున్న 30 సంవత్సరాలు పై బడిన వారంతా బీపీ, షుగర్ చెకప్ చేసుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ పి.ఇందిర, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed