- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిజాంపేట్ లో పోలీస్ వాలీబాల్ టోర్నమెంట్
దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ లోని గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బాలానగర్ జోన్ పోలీస్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. గత రెండు రోజుల నుండి నిర్వహించిన ఈ టోర్నమెంట్ పోటీలలో బాలానగర్ జోన్ పరిధిలో గల 8 పోలీస్ స్టేషన్ లలో 40 టీంలు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గర్ల్స్ టీం, సరూర్ నగర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు పాల్గొన్నారు.
బాచుపల్లి టీం వాలీ బాల్ లో తమ ప్రతిభను చాటి మొదటి బహుమతి గెలుచుకుంది. అలాగే రెండవ బహుమతి అల్లాపూర్ టీం గెలుచుకుంటే మూడవ ప్రైజ్ వివేకానంద, అల్లాపూర్ టీం గెలుచుకుంది. విజేతలుగా నిలిచిన టీంలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అభినందించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ రావు, బాచుపల్లి సీఐ ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.