అవినీతి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలి

by Shiva |
అవినీతి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలి
X

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

దిశ, కాప్రా: రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగిస్తూ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఏఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శక్తి కేంద్రం ఇన్ చార్జ్ ఉమా శ్రీధర్ ఆధ్వర్యంలో కాల్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన సాగిస్తోందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరొపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల ఆశయాలను నట్టేట ముంచారని విమర్శించారు. మిగులు ఆదాయంతో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులతో జాతీయ రహదారులు తప్ప మిగతా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య , పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటూ నిధులను దారి మళ్లిస్తూ అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.

అశాస్త్రీయమైన జీవో నెం.317 తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేసీ అధ్యక్షులు రమేష్ యాదవ్, సీనియర్ నాయకులు మర్రి మోహన్ రెడ్డి గారు, డివిజన్ ఇన్ చార్జ్ ఎంపాల పద్మా రెడ్డి , కృష్ణారెడ్డి, జీ.వీ.ఎన్. రావు, అంబటి వెంకటాచలం జిల్లా కార్యదర్శి, తుమ్మల సంధ్యారెడ్డి, కుంతల కిరణ్ కుమార్, తేలు నాగరాజు, గిరి గౌడ్, దొంతల ప్రభాకర్, సీహెచ్ మేరి, పాపిరెడ్డి, వికాస్ గుప్తా, కిషోర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed