- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభివృద్ధిలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాటిలేదు: మంత్రి మల్లారెడ్డి
దిశ, దమ్మాయిగూడ: అభివృద్ధిలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాటిలేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ సాధారణ నిధులు రూ. 13.5 లక్షలతో వైకుంఠ రథాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తులు చనిపోతే వారి అంతిమ సంస్కారాలు అత్యంత గౌరవంగా జరగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని, అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైకుంఠ ధామాలు నిర్మించారని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు గాను మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ. 4.50 కోట్లతో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బడ్జెట్ ఆమోదింపజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధి నిధుల కొరత మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎ. స్వామి, డీఈఈ సుమతి, మేనేజర్ వెంకటేశం కౌన్సిలర్లు నాను నాయక్, నాగాయపల్లి సుజాత, కొత్త హేమలత, మంగళపురి వెంకటేష్, కొత్త సురేఖ, వరగంటీ వెంకటేష్, మాదిరెడ్డి పావని రెడ్డి, సంపన్ బోల్ స్వప్న , గోగుల సరిత, ముప్ప శ్రీ లత, గురువెళ్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.