ఆత్మాహుతి దాడి.. 10 మంది సైనికులు మృతి

by Rani Yarlagadda |
ఆత్మాహుతి దాడి.. 10 మంది సైనికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan)లో ఆత్మాహుతి దాడి (Suicide Bomb Attack) జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. కారును పేల్చిన అనంతరం అతని సహచరులు కాల్పులకు పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని ఓ అధికారి చెప్పారు. ఈ దాడిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed