- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత బాటలో వైసీపీ.. వ్యూహాలు ఫలించేనా ?
దిశ, పల్నాడు: ఘోర ఓటమి చవిచూసిన తరువాత వైసీపీ దిద్దుబాటు చర్యలకు మల్లగుల్లాలు పడుతుంది. ఎన్నికలకు ముందు అభ్యర్థులను ఎడాపెడా స్థాన చలనాలు చేసిన ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం వారిని యదాస్థానాలకు పంపడం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడైతే ప్రయోగాలు చేపట్టిందో ఆ జిల్లా నుంచే తిరిగి అక్కడి నుంచే పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.
చిలకలూరిపేటకు రజినీ రిటర్న్..
గెలిచిన మొదటి సారే మంత్రిగా పనిచేశారు విడదల రజిని. 2014లో టీడీపీలో ఉన్న ఆమె 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిగా టీడీపీ ప్రభుత్వంలో హవా చెలాయించిన ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి సంచలనం సృష్టించారు. అయితే ఆమె విజయం సాధించినప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలు విడిపోయింది. మర్రి రాజశేఖర్, లావు శ్రీ కృష్ణదేవరాయలు ఒక వర్గంగా, విడదల రజని మరో వర్గంగా చీలిపోయారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే జగన్ విడదల రజనీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించారు. 2024 ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చిన వైసీపీ అధిష్టానం విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు పంపింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. అటు చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన మనోహర్ నాయుడు కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి మనోహర్ ఆ నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం చిలకలూరిపేటకు తిరిగి రజనీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లతో పాటు ఆమె కుటుంబానికి బలమైన పట్టుండటంతో తిరిగి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే మర్రి రాజశేఖర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో రజినీని విబేధించిన లావు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. దీంతో అక్కడ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయా అని ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.
తాడికొండలోను మార్పులు..
మరోవైపు తాడికొండ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా డైమండ్ బాబును వైసీపీ అధిష్టానం నియమించింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన సుచరిత రాజకీయాల్లో కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో ఆమె స్థానంలో డైమండ్ బాబుకు అవకాశం ఇచ్చారు. అయితే సుచరిత భర్త దయాసాగర్‌కు ఇన్‌చార్జ్ ఇవ్వాలని అడిగినప్పటికీ స్పందించలేదన్న ప్రచారం జరుగుతోంది.
ఈ స్థానాలు వీరికేనా?
మంగళగిరిలో కూడా గతంలో పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన లావణ్యను బరిలోకి దించగా ఆమె ఓడిపోయింది. తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేమారెడ్డిని ఇన్‌చార్జ్‌గా వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చర్చ మొదలైంది. గుంటూరు మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు తనకి ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు గుంటూరు జిల్లా అధ్యక్షుడి గా ఉన్న అంబటి రాంబాబుకి నియోజకవర్గాన్ని కేటాయించాల్సి ఉంది. ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లిని వదిలి పెట్టి గుంటూరు వచ్చారు. ఈక్రమంలోనే ఆయనను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది.