కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి

by Sridhar Babu |
కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి
X

దిశ, ఆదిలాబాద్ : వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, గత సెప్టెంబర్ 2న ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకు ముందు కలెక్టరేట్ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కిరణ్ మాట్లాడుతూ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యలతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.

ఆ కమిటీ ప్రభుత్వంకు నివేదిక ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రాత పరీక్ష పెట్టడం సరికాదని, వెంటనే రాత పరీక్షను రద్దు చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ నవీన్ కుమార్, ఏఎన్ఎం లు పుష్ప, ఆనందబాయి, తులసి, మమత, ప్రియదర్శిని, అహల్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story