Additional Collector Radhika Gupta : తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠం..

by Sumithra |
Additional Collector Radhika Gupta : తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠం..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : తల్లి పాలు బిడ్డకు శ్రేష్టమని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసే పొస్టర్ ను అదనపు కలెక్టర్ గురువారం తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక తల్లి తన బిడ్డకు ఇవ్వగల మొట్టమొదటి కానుక తల్లిపాలు అని తెలిపారు.

బిడ్డకు తల్లి పాల వల్ల కలిగే ప్రయోజనాలను, విశిష్టతను జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. మొదటి ఆరు నెలల వరకు పుట్టిన పిల్లలకు కేవలం తల్లిపాలే సంపూర్ణ ఆహారం, సంపూర్ణ ఆరోగ్యం అందించడానికి తోడ్పడుతాయని తెలియజేయాలని సూచించారు. సి - సెక్షన్ ద్వారా పుట్టిన శిశువు మనుగడకు తల్లిపాలు పట్టించడం తప్పనిసరి అని అడిషనల్ కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి రఘునాథ స్వామి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story