- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల సమస్యలకు కృషి చేస్తా.. మంత్రి తలసాని శ్రీనివాస్ హామీ
దిశ, కంటోన్మెంట్: ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ వేటేరినెరియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 డైరీని సోమవారం మారేడ్ పల్లిలోని తన నివాసంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ... మత్స్య సంపదను పెంచేందుకు ఉద్యోగులంతా చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బింగి సురేష్, కార్యదర్శి, అభిషేక్, గ్రేటర్ అధ్యక్షుడు రతన్, కోశాధికారి సుధాకర్, ప్రధాన కార్యదర్శి రామచంద్రం, అజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.