- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
corruption : పోచారంలో భారీ అవినీతి.. నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీలు..
దిశ, ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీలో అధికారుల లంచగొండితనం కారణంగా భారీగా అవినీతి జరుగుతోంది. అపార్ట్మెంట్లు, లేఔట్లకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్)లు ఇచ్చి రూ.లక్షల దండుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా హెచ్ఎండీఏ అధికారులు సైతం అపార్ట్మెంట్లు, లేఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో మున్సిపల్ అధికారుల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలకు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తుండడంతో రియల్టర్లు పార్కు స్థలాలను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ అధికారుల అవినీతి పై స్థానికులు ఇటీవల తెలంగాణ విజిలెన్స్ కమిషన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు ఫిర్యాదు చేయడంతో అధికారుల అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తప్పుడు ఎన్ఓసీలు...
అన్నోజిగూడ సర్వేనెంబర్ 36/ఏ/ఏఏ, 37/ఇ,38/ఇ లో లేఅవుట్ కు వెళ్ళే ప్రధాన దారి 20 అడుగుల వెడల్పు ఉండగా 30 అడుగులున్నట్లు రికార్డుల్లో చేర్చి ఎన్ఓసీలు జారీ చేశారు. అదేవిధంగా సర్వే నెంబర్ 10, 11, 12/పిలో పది అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న "ఐడియా ఎస్టేట్స్ లిమిటెడ్" సంస్థ 20 అడవుల వెడల్పు రోడ్డును 40 అడుగుల వెడల్పు రోడ్డుగా రోడ్డుగా చూపించి తప్పుడు ఎన్ఓసీలు పొందారు. దీని పై స్థానికులు హై కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. కోర్టును సైతం మున్సిపల్ అధికారులు తప్పుదారి పట్టించి ఎన్ఓసీలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
పార్కు స్థలాలు కబ్జా...
నారపల్లి సర్వేనెంబర్ 27, 28 లోని 1.10 ఎకరాల పార్కు స్థలాన్ని కబ్జా చేసి "జైన్ కన్స్ట్రక్షన్స్ ఎస్వీఎస్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" సంస్థ అపార్ట్మెంట్లు నిర్మిస్తోంది. పార్క్ స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలని పాలకవర్గం తీర్మానం చేసినప్పటికీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా అన్నోజిగుడాలో సర్వేనెంబర్ 9, 10లో ఓ వెంచర్లో పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా కమిషనర్ పట్టించుకోకుండా వదిలేశారు. పోచారం ఇన్ఫోసిస్ సమీపంలో సర్వేనెంబర్ 44, 59, 60 లో జి+2 అనుమతులు తీసుకొని అదనంగా మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. సర్వే నంబర్ 2, 10 లో సంస్కృతి టౌన్షిప్ లో ఇలాంటి అనుమతులు లేకుండా " పల్లవి మోడల్ స్కూల్" నిర్మాణం జరుగుతుంది. అక్రమ నిర్మాణం కోసం అధికారులు భారీ ఎత్తున లంచాలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇట్టి అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కేవలం నోటీసులకే పరిమితమై, మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు లేవనే సాకు చెబుతుండటం గమనార్హం. అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి పట్టించుకోకపోవడంతో రాష్ట్ర విజిలెన్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు స్థానిక యువకుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి.. సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు
సంవత్సర కాలంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాల పై ఎన్ని ఫిర్యాదులు చేసినా కమిషనర్ పట్టించుకోవడం లేదు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.3 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న కమిషనర్ వేమన రెడ్డి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు, మాజీ మంత్రి మల్లారెడ్డి సహకారంతో పోచారం బదిలీ చేయించుకున్నారు. ఇక్కడ కూడా తన పద్ధతి మార్చుకోకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడు. రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.
అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం.. పశ్య వేమన రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పోచారం
పోచారం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం. అయితే బిల్డర్లు, రియల్టర్లు, హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తెచ్చుకుని అదనంగా నిర్మిస్తున్న అంతస్తుల కూల్చివేత విషయంలో హెచ్ఎండీఏ అధికారులు చర్యలు తీసుకోవాలి. సంస్కృతి టౌన్షిప్ లో కార్పొరేట్ పాఠశాల భవనాల నిర్మాణాలకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తెచ్చుకోవాలని నోటీసులు కూడా ఇచ్చాం. లేనిపక్షంలో కూల్చివేసాని హెచ్చరికలు కూడా చేశాం. కోర్టు ఆదేశాలు, ఉత్తర్వులను తప్పుదారి పట్టించి ఎన్ఓసీలు ఇవ్వలేదు. రాజకీయ పలుకుబడి, ఆధిపత్యం కోసం అధికారులను బలి చేయొద్దు.