- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేటీఆర్ తో మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ..
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి : బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కీటీఆర్ కలిసి కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని పలు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ 119 పరిధిలో వరద నీటి కాలువ ఏర్పాటు కొరకు రూపాయలు 20 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ సెంటర్ పాయింట్ బ్రిడ్జి, న్యూ బోయిన్ పల్లి నుండి ఆర్ఆర్ నగర్, ప్రాగా టూల్స్ ఓపెన్ ల్యాండ్ దాదాపుగా మూడు కిలో మీటర్లు వర్షం నీటి కాలువ నిర్మాణం కొరకు దాదాపుగా 12 కాలనీలు ముంపుకు గురికాకుండ నివారించగలవు.
కాబట్టి ఇట్టి నిర్మాణం కొరకై తగిన చొరవ తీసుకొని నిధులు విడుదల చేయాలని మర్రిరాజశేఖర్ రెడ్డి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కూకట్ పల్లి నియోజకవర్గం బోయిన్ పల్లి డివిజన్ ఆర్ఆర్ నగర్ నుండి వరంగల్ రైస్ స్టోర్ వరకు వరద నీటి కాలువ నిర్మాణం నిమిత్తం ఆరు కోట్లు విడుదల చేయాలని, కంటోన్మెంట్ నియోజకవర్గంకు 14 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా రెండు పనుల కొరకు 20 కోట్లు ఖర్చు అవుతుందని, నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కీటీఆర్ సానుకూలంగా స్పందించారని, తొందరలోనే నిధులు అందచేస్తానని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.