కేసీఆర్ భీమా - ప్ర‌తి ఇంటికి ధీమా : బండారి లక్ష్మారెడ్డి

by Aamani |   ( Updated:2023-11-14 16:26:01.0  )
కేసీఆర్ భీమా - ప్ర‌తి ఇంటికి ధీమా : బండారి లక్ష్మారెడ్డి
X

దిశ, నాచారం: కేసీఆర్ భీమా - ప్ర‌తి ఇంటికి ధీమా ఇది పాపు ల‌ర్ స్కీం అని, అన్ని కుటుంబా ల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉంటుందని బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్ డివిజన్, విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య, వైస్ ప్రెసిడెంట్ హమాలి శీనుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి, ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గొల్లురి అంజయ్య లతో పాటు పలువురు కార్పొరేటర్లు, కార్మిక శాఖ నాయకులు, ఉద్యమకారులు, హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో కార్మికులకు ప్రోత్సాహకరంగా అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. కార్మికులతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందంటూ, కార్మికులను మా ట్రస్ట్ ద్వారా నిత్యం ఆదుకుంటూనే ఉన్నామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని సంగతి మర్చిపో వద్దన్నారు. నాకు టికెట్ వచ్చి రెండు నెలలు అయింది, టికెట్ రాగానే ఉప్పల్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను కేసీఆర్, కేటీఆర్ సహకారంతో రెసిడెన్షియల్ జోన్ లోకి తెచ్చానని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక జూనియర్ మరియు డిగ్రీ కళాశాలను తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి మొదలగు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని అర్హులైన వారందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ముఖ్య నాయకులు, ఉద్యమకారులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed