- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీతోనే భారత్ నెంబర్ వన్ : ఈటల
దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రపంచ దేశాల్లో భారత్ నెంబర్ వన్ గా నిలబడాలంటే మరోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటేనే సాధ్యమవుతుందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం లో జరిగిన మహావీర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వారి మద్దతు కోరారు. అనంతరం జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లను గెలవబోతుందని అందులో మల్కాజిగిరి కూడా ఉండేలా ఓటర్లు తీర్పు ఇవ్వాలని తెలిపారు.
అభివృద్ధితోపాటుగా ప్రశాంతంగా దేశ ప్రజలు జీవించాలంటే అది మోడీ తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ కు సైతం ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కోర ఆనంద్ భవన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్, బీజేపీ నాయకులు మురళి యాదవ్, కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ బోడ నర్మద మల్లిఖార్జున్.. జైన్ సంఘం ప్రతినిధులు గౌతమ్ జైన్, ప్రదీప్ జైన్, జీత్మల్ జైన్, మంగళ్ జైన్, ఉమేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు.