- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు బైకులు ఢీ... ఒకరు మృతి
దిశ, కొత్తూరు : రెండు బైకులు ఢీకొని ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం సమీపంలోని కొత్తూరు తండా దగ్గరలో పెంజర్ల రోడ్డులో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కొత్తూరు తండాకు చెందిన మంగలి కిషోర్ (42) మండల కేంద్రంలో సెలూన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. యధావిధిగా శనివారం రాత్రి తన సెలూన్ షాప్ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తూరు తండా వద్ద కూడి వైపు టర్న్ తీసుకుంటుండగా అతివేగంగా వస్తున్న కొడిచర్ల నివాసి శ్రీకాంత్ కిషోర్ బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కిషోర్ ను హుటాహుటిన శంషాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మృతిని తమ్ముడు మంగలి నరేష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ నరసింహారావు, ఎస్ఐ మురళి గౌడ్ లు తెలిపారు.
అదుపుతప్పి బోల్తా పడిన తుఫాన్ వాహనం
ఓ తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కొత్తూరు తండా దగ్గర పెంజర్ల రోడ్ లో జరిగింది. అతివేగంగా రావడం వల్లే తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.