- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Stock Market: మహాయుతి కూటమి ఘన విజయం.. స్టాక్ మార్కెట్లకు బిగ్ బూస్ట్..!

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP), శివసేన(Shivasena), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లతో కూడిన మహాయుతి కూటమి(Mahayuti Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లకు గాను మహాయుతి కూటమి 233 సీట్లు కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని(Financial Capital) ముంబై(Mumbai)లో రాజకీయ సుస్థిరత(Political Stability) దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)కు బిగ్ బూస్ట్ అని పలువురు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు ఎన్డీఏ కూటమి గెలుపుతో సోమవారం పాజిటివ్(Positive)గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి రంగాలకు ప్రయోజనమని చెబుతున్నారు. ఈ ఫలితాల పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్ డైనమిక్స్(Market Dynamics)ను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.