అర్హులందరికీ సంక్షేమ పథకాలు

by Naveena |
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
X

దిశ,కోదాడ: నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి బిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గడపగడపకు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు. 82 చెక్కులు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ 82 లక్షలు 9512 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, తహసిల్దార్లు వాజిద్ అలీ, హిమబిందు, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, ఎడవల్లి బాల్ రెడ్డి, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పులి సులోచన రావు, రేవూరి వెంకటాచారి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed