- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
singer Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం.. ఫొటోలు వైరల్

దిశ, సినిమా: సింగర్ మంగ్లీ (singer Mangli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందు ప్రైవేట్ సాంగ్స్ (Private Songs)తో కెరీర్ మొదలుపెట్టన మంగ్లీ.. తన ప్రత్యేకమైన గొంతుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ప్రజెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీ (Cinema Industry)లో వరుస సాంగ్స్ పాడుతూ దూసుకుపోతోంది. ఫోక్ (folk), డివోషనల్ (devotional), ఐటెం సాంగ్స్ (Item Songs) కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్‌లో తన మార్క్ చూపిస్తుంది. జార్జి రెడ్డి మూవీలోని ‘రాయల్ ఎన్ఫీల్డ్’ సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ.. అక్కడ నుంచి తన గ్రాఫ్ అంతకంతకు పెంచుకుంటూ పోతోంది.
అల వైకుంఠపురం (Ala Vaikunthapuram)లో ‘రాములో రాములా’, లవ్ స్టోరీ (Love Story) చిత్రంలోని ‘సారంగదరియా’తో పాటు అనేక సాంగ్స్ పాడి ఆడియన్స్ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది. ఆమె ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో అందుకున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. శుభాకాంక్షులు తెలుపుతున్నారు నెటిజన్లు.
Read More...
Devi Sri Prasad: ఒక్క పాటతో అందరికీ చెంప చెల్లుమనే సమాధానం చెప్పిన దేవి శ్రీ ప్రసాద్