- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నో పార్కింగ్.. రాఘవేంద్ర హోటల్ ముందు రోడ్డుపైన అక్రమ పార్కింగ్..
దిశ, ఉప్పల్ : ఉప్పల్ లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. ఆఫీస్ టైమింగ్స్ లో మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు. ఉప్పల్ లో స్కై వాక్ పనులు, ఎలివేటెడ్ కారిడార్ పనులు వలన ఉప్పల్ ప్రాంతంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రమైపోతుంది. ఉదయం, సాయంత్రం సమయంలో సర్వే ఆఫ్ ఇండియా రాఘవేంద్ర హోటల్ ముందు తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందనీ వాహదారులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ తో వాహనదారులకు నరకం కనిపిస్తుందని బాధ వెళ్లబుచ్చుకుంటున్నారు.
రాఘవేంద్ర హోటల్ ముందు అడ్డగోలుగా రోడ్లపైనే పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని వాహనదారులు అంటున్నారు. పాదాచరులు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది అవుతుందని ఆరోపిస్తున్నారు. రాఘవేంద్ర హోటల్ కు వచ్చే కస్టమర్స్ వాహనాలను రోడ్డు మీదనే పార్క్ చేసి వెళ్లడం వలన నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతున్నా కూడా రాఘవేంద్ర హోటల్ యాజమాన్యం కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ లు చొరవ తీసుకోని స్పెషల్ డ్రైవ్ పెట్టి రాఘవేంద్ర హోటల్ ముందు రోడ్డు పైన వాహనాలు పార్క్ చేయకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.