MLC Kavitha: సివిల్స్ రైట్స్ డేను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్సీ కవిత

by Y. Venkata Narasimha Reddy |
MLC Kavitha: సివిల్స్ రైట్స్ డేను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రామాల్లో, పట్టణాల్లో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు చైతన్యం కల్పించేందుకు ప్రతి నెల చివరి ఆదివారం సివిల్ రైట్స్ డే(Civil Rights Day)పేరుతో జరిపే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)వచ్చినప్పటి నుండి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)విమర్శించారు. శాసన మండలిలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఎక్కడ కూడా సివిల్ రైట్స్ డే అమలు చేయలేదన్నారు. గత ఏడాది కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై నేరాల రేటు పెరుగుతుందని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పాటు సివిల్ రైట్స్ డేను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మండల స్థాయి ప్రజాప్రతినిధులను కూడా సివిల్ రైట్స్ డే అమలులో భాగస్వామ్యం చేయాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed