Heavy Rains:‘అప్రమత్తంగా ఉండండి’.. భారీ వర్షాల పై సీఎం చంద్రబాబు సమీక్ష

by Jakkula Mamatha |   ( Updated:2024-12-21 09:05:50.0  )
Heavy Rains:‘అప్రమత్తంగా ఉండండి’.. భారీ వర్షాల పై సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rain) కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నేడు(శనివారం) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా CMO అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబుకు వివరించారు. భారీ వర్షాలపై కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

భారీ వర్షాలు(Heavy Rains) ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి పని చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు,

Advertisement

Next Story