అత్యాశే ఆ మహిళను నిలువునా ముంచింది..

by Sumithra |
అత్యాశే ఆ మహిళను నిలువునా ముంచింది..
X

దిశ, మల్యాల : అత్యాశే ఆ మహిళను నిలువునా ముంచింది. సినిమాను తలపిస్తున్న ఘటన మల్యాల మండలంలో చోటుచేసుకుంది. గుప్త నిధుల ఆశ చూపి కొండగట్టుకు చెందిన ఒక మహిళకు 45 లక్షల టోక్రా వేశాడు ఓ ఘనుడు. కొండగట్టు పరిసర ప్రాంతాల్లో పూర్వకాలం నాటి గుప్తనిధులు దాగి ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే కోటీశ్వరులు కావచ్చు అన్న మాటలు విన్న మహిళ ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మింది. దొంగల మర్రి సమీపంలో తవ్వకాలు జరపగా వారికి ఒక పాత్రలో బంగారు నాణేలు కనిపించాయని తెలిపింది. దానిని తీయడానికి కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని నమ్మించి పలు దఫాలుగా 45 లక్షల రూపాయల వరకు టోక్రా వేశాడు.

ఆ మహిళ దగ్గర ఆ వ్యక్తి అడిగిన డబ్బులు లేకపోవడంతో కొండగట్టులోని కొందరికి ఈ విషయాన్ని తెలిపి నిధిని వెలికి తీసిన తర్వాత పంచుకుందామని వారి వద్ద నుండి డబ్బులు తీసుకొని ఆ వ్యక్తికి ముట్టచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ వ్యక్తి డబ్బులు తీసుకొని స్పందించకపోవడంతో మోసపోయానని గమనించిన మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. ఈ విషయం పై దిశ ప్రతినిధి మల్యాల ఎస్సై నరేష్ ను వివరణ కోరగా గత 15 రోజుల క్రితం కొండగట్టు గ్రామం నుండి ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు నిందితుడిని సూర్యాపేట జిల్లా లింగనాయక్ గా గుర్తించి తనను పట్టుకునేందుకు పోలీస్ సిబ్బంది రెండు సార్లు వెళ్లిన నిందితుడు పరార్ లో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed